నాకు తెలిసిన చలం

సెప్టెంబర్ 11, 2008 at 12:14 సా. 19 వ్యాఖ్యలు

గొప్పగా అలోచించే వాళ్ళలో ఓ రకమైన విశ్రుంఖలత్వం వుంటుంది. వీళ్ళు ముఖ్యంగా మన సనాతన ధర్మాలని ప్రశ్నిస్తారు. కానీ వీళ్ళ వాక్పటిమ ఎంతగా వుంటుందంటే, వీళ్ళు మన ఆచారాలను ప్రశ్నించినా అందులో ఏదో నిజం ఉందనుకుంటాం. ఇలాంటివాళ్ళు వితండవాదం చేసినా అది అభ్యుదయ భావాలుగల వాళ్ళకు నచ్చుతుంది. కానీ వీళ్ళని సాంప్రదాయవాదులు వ్యతిరేకిస్తారు, సరైన కారణం లేకపోయినా, ఎందుకంటే వీళ్ళ తర్కానికి వాళ్ళు సమాధానం చెప్పలేరు. ఈ అభ్యుదయ భావాలు గల వాళ్ళు (వీళ్ళలో ఓ వర్గమే ఈ హేతువాదులు) ఇలాంటి వాళ్ళకోసమే ఎదురు చూస్తుంటారు. వీళ్ళు చెప్పేది నిజమా కాదా అని ఆలోచించరు.

ఇలాంటి విశ్రుంఖలత్వం ఉన్నవాళ్ళలో చలం ఒకరని నాకు అనిపించింది. నేను సుజాత అనే ఒక కథ చదివాను (చలం వ్రాసింది). సుజాత భర్త గొప్ప స్వాతంత్ర్యవాది(ఇది బ్రిటిష్ కాలంలో జరిగిన కథ). సుజాత భర్త ఆమెని చాలా ప్రేమగా చూసుకుంటుంటాడు. ఐనా ఆమె ఓ పోలీస్ తో అక్రమసంబంధం పెట్టుకుంటుంది. భర్తకి జబ్బు చేస్తుంది. అప్పుడు ఆమెకి భర్త మీడ జాలి కలుగుతుంది. భర్తకి సేవ చేస్తూ ఉంటుంది. కానీ ఈ పోలీస్ దగ్గరికి వెళ్ళడం మాత్రం మానదు. చివరగా తన తప్పు తెలుసుకుంటుంది (తెలుసుకున్నట్టు అనిపిస్తుంది), ఎలా అంటే నా భర్తని ఈ స్థితిలో వుండగా నీతో రాలేను అంటుంది. మళ్ళీ పోలీస్ మీదే మనసు ఉంటుంది ఆమెకు. ఇది మామూలుగా ఎవరైనా చెబితే ఈమె శీలం లేనిది అనే భావన కలుగుతుంది. కాని ఈ కథను చలం మలచిన తీరు చూస్తే మనకు వేరే అభిప్రాయం కలుగుతుంది. అరె ఈమె భర్తకోసం ఎంత త్యాగం చేసింది అని అనుకుంటాం చివరకి. ఇది చలం నైపుణ్యము.

చలం ఆదర్శవాదులకు నచ్చుతాడు. ఎందుకంటే వీళ్ళు సామాజిక కట్టుబాట్లగురించి ఆలోచించరు. కేవలం ఆ వ్యక్తి కోణం నుంచి ఆలోచిస్తారు. ఈమెకి కోరిక కలిగింది కాబట్టి అతనితో వెళ్ళింది అని అనుకుంటారు. ఇక్కడ శీలం అన్న పదానికి విలువ లేదు. మనకు నచ్చింది మనం చేస్తాం అనే పద్దతిలో ఉంటారు. కాని కాస్త వాస్తవికతతో ఆలోచించే సాంప్రదాయవాదులు (వీళ్ళు, ఈమె తప్పుచేసింది అనే కోణంలో ఆలోచిస్తారు ) చలాన్ని వ్యతిరేకిస్తారు. ఈ గొప్పోళ్ళంతా ఏదో సమాజం పాడైపోయింది, మనమే దీన్ని ఉద్దరించాలి అని ఉన్న సాంప్రదాయాలకి భిన్నంగా రాస్తారు. ఇలాంటివారు కొన్ని సామాజిక కట్టుబాట్లు సహేతుకంగా లేకపొయినా, వీటిపట్ల వీళ్ళు మరీ అతిగా స్పందిస్తారు, పర్యవసానాలగురించి అలోచించకుండా.

ప్రకటనలు

Entry filed under: నా అభిప్రాయాలు.

నా దేశం ఎందుకిలా ఉంది… వైరస్ లను నిరోధించే సులువైన మార్గం

19 వ్యాఖ్యలు Add your own

 • 1. కె.మహేష్ కుమార్  |  1:47 సా. వద్ద సెప్టెంబర్ 11, 2008

  చలాన్ని “అర్థం చేసుకోవాలనుకునే” మీ సాహసానికి నా అభినందనలు. నా మేధకు చలం అర్థంకాడు, అందుకే నేను కేవలం అనుభవించడానికి ప్రయత్నిస్తాను.

  స్పందించండి
 • 2. శశాంక  |  5:57 సా. వద్ద సెప్టెంబర్ 11, 2008

  చలంని అర్ధం చేసుకోవడానికి నా వయసు అనుభవం రెండూ చాలవులెండి. ఏదో ఈ కథ చదివిన వేడిలో నాకు తోచింది రాశా అంతే

  స్పందించండి
 • 3. నిషిగంధ  |  7:48 సా. వద్ద సెప్టెంబర్ 11, 2008

  అసలు చలం డిక్షనరీ లో శీలం అనే పదం/పదార్ధం లేదనిపిస్తుంది.. మనసెటు వెళ్తే మనల్నీ అటే వెళ్ళమంటాడు! ఎవర్నైనా ‘తనది ‘ అనే చట్రంలో బిగించకుండా ప్రేమించమటాడు.. ఆయన కధల్లోని నాయికలను అలానే చూపించాడు కానీ సుఖాంతం అయిన కధలు బహు తక్కువ!!

  స్పందించండి
  • 4. nirmal  |  4:19 సా. వద్ద ఫిబ్రవరి 7, 2011

   భాగున్నారా?
   మీరు చెప్పింది కరెక్టే, చలం డిక్షనరీ లో శీలం అనే పదం/పదార్ధం లేదు కారణం శీలం అంటే ఏమిటి? శీలం ఒక్క స్త్రీ కి మాత్రమే వుంటుందా? పురుషుడికి వుండదా? అందుకే చలం డిక్షనరీ లో శీలం అనే పదం/పదార్ధం లేదు. పురుషుడి కి స్వేఛ్చ ఎటువంటిదో స్త్రీ స్వేఛ్చ అటువంటిదే . జీవితానికి సంబంధించి ప్రతి రంగంలోనూ, ప్రతి ఒక్క అంశంలోనూ పురుషుడి కి ఏది స్వేచ్చో స్త్రీ కి అదే స్వేఛ్చ, అని చలం అభిప్రాయం.

   స్పందించండి
 • 5. KRISHNA RAO JALLIPALLI  |  8:19 సా. వద్ద సెప్టెంబర్ 11, 2008

  మీ భావాలను మీరు వెలిబుచ్చారు. తప్పు లేదు. కాని.. మరిన్ని చలం పుస్తకాలు చదవండి.
  చలం చెప్పేదేమిటి అంటీ (my own interpretetion)… తప్పు చేయడానికి మగ వాడికి ఎంత స్వేచ్ఛా, అధికారం, అవకాశం ఉందొ.. అవన్నీ ఆడవారికి కూడా ఉండాలంటారు. మగవాడు వ్యభిచారం చేస్తీ లేని తప్పు… ఆడవారు చేస్తీ తప్పెందుకు అవుతుంది. శీలం అనేది ఆడవారికి మాత్రమె ఉండాలా. . మగాడికి ఉండక్కరలేదా?? వాడికేమి… వాడు మగాడు.. ఏమి చేసినా చెల్లుతుంది అనేవారిని చెప్పు తీసుకొని కొట్టాలి. మగవారికి ఒక రూలు, ఆడవారికి ఒక రూలు ఉండకూడదు. అందరు సమానమే.. even in commiting sins … ఇది చలం చెప్పేది. చదవండి… రాస్తూ ఉండండి.

  స్పందించండి
 • 6. durgeswara  |  8:23 సా. వద్ద సెప్టెంబర్ 11, 2008

  చలం గారి చివరిదస రచనలు చదవండి .అరుణాచలం నుంచి మిత్రులకు వ్రాసిన ఉత్తరాలు చదవండి. అనుభం జీవిత సత్యాన్ని ఎలాబోధిస్తుందో మనిషికి ,అర్ధమవుతుంది. చలమెకాదు, ఇలా పూర్వజన్మ వాసనలలో విస్రుంఖలతకు అలవాటుపడి. ఈ జన్మలో మనుషులుగా జన్మించిన వారి మానసిక పరిస్తితి మొదటి దశలో ఇలాగే వుంటుంది.

  స్పందించండి
 • 7. అబ్రకదబ్ర  |  2:25 ఉద. వద్ద సెప్టెంబర్ 12, 2008

  నాకు ఇరవయ్యేళ్లప్పుడనుకుంటా, చలంగారి ‘మైదానం’ చదివా. చెత్తలా అనిపించింది. అసలదంత హిట్టవుతుందని ఆయననుకున్నాడో లేదో! బూతుల్లేని బూతు కధ. దానికంత పేరెందుకో అర్ధం కాలేదు. ఈ పుస్తకానికి జేజేలు కొట్టేవాళ్లెవరూ అందులో ఉన్నవాటిని ఆచరణలో పెట్టేవాళ్లు కారన్నది నిజం.

  ఎవరైనా తప్పు చేస్తుంటే దిద్దాలి కానీ, ‘నువ్వు తప్పు చేసినప్పుడు లేనిది నేను చేస్తే వచ్చిందా’ అనేది వితండవాదం, విచ్చలవిడితనం. చలం రచనల్లో ఉండేది ఇదే అయితే ఇదేం స్త్రీవాదం?

  స్పందించండి
 • 8. శ్రవణ్  |  11:18 ఉద. వద్ద సెప్టెంబర్ 12, 2008

  నేను చలం “మైదానం” మాత్రమే చదివాను. నాకైతే అందులో చలం “స్త్రీ హృదయాన్ని” తెలుసుకోవాలనే ప్రయత్నమే కనిపిస్తుంది. ఒక స్త్రీ మనస్సులోని సంఘర్షణ తెలుస్తుంది. (క్యారెక్టరైజేషన్, సిచువేషన్‌ల వల్ల ) విచ్చలవిడితన్నాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా అనిపించలేదు, పైగా మనం పుస్తకం చదివేటప్పుడు ఒకరకమైన ట్రాన్స్‌లో వుంటాం.

  ఇకపోతే అది హిట్ అవ్వడానికి స్త్రీని నాలుగ్గోడలమధ్య బంధిచే రోజుల్లో వచ్చింది కాబట్టే. సినిమా హిట్టుకీ రిలీజ్‌కి సంబంధమున్నట్టే ఈరోజుల్లో వస్తే ఆపుస్తకానికి పెద్ద విలువ వుండేదికాదేమో (content వొకటే అయినా).

  స్పందించండి
  • 9. nirmal  |  5:34 సా. వద్ద ఫిబ్రవరి 4, 2011

   nirmal j
   నమస్కారం ! చలం మైదానం లో బూతు మాత్రమే ఎందుకు కనిపించింది. కధలో కధ నాయిక పరిస్తితి ఎందుకు కనిపించ లేదు. కధలో కధ నాయిక మాటలు : ఇలా శరీర ఆకర్షణకి లోబడి జీవితాన్ని వప్పగించుకున్న దర్భాగ్యాల గతి యింతే గావును . వేర్రిదననైనానా ?

   ఈ ఒక్క కొమ్మనీ నమ్ముకుని అని ఆశ్రయాలనీ తన్నేశాను. ఇది యిట్లా పెళ్ళుమని విరిగింది.
   ఒక్క పుస్తకాని పదిమంది చదివినప్పుడు అందులోవున్న విషయం ఏమిటో పదిమందికి ఒకే రకంగా కనబడితే ( అందరికి మంచిగా లేక అందరికి చెడ్డగా కనబడితే )దాని వల్ల వివాదం వుండదు.
   చలం శృంగారం రచనలు మాత్రమే చేశాడు అని చాలా మంది అభిప్రాయం . ఐతే “శృంగారం”లేని రచనలు “స్త్రీ పాత్ర ” లేని రచనలు చాలా వున్నాయి.

   స్పందించండి
 • 10. Saraswathi Kumar  |  11:31 ఉద. వద్ద సెప్టెంబర్ 12, 2008

  చావుకి ముడిపెడితేగానీ లంఖణానికి ఒప్పుకోరన్న చందంగా జడసమాజంలో ఒకింత స్పందన కోసం చలం తన భావాలలో కొంత తీవ్రతను ప్రదర్శించాడు. దానిని అలానే అర్థం చేసుకోవాలి గానీ as it is గా తీసుకోకూడదు. చలం లేవనెత్తిన అంశాలు తిరుగులేనివి. చలం సారాంశాన్ని, చలం అసలు ఉద్దేశాలను అర్థం చేసుకోవాలంటే కొంత పరిణితి ఉండాలి. ఒక్క రచనతో చలం అర్థం కాడు. మీకు చలం గురించి ఆసక్తి ఉంటే ప్రస్తుతం మార్కెట్లో వాడ్రేవు వీరలక్ష్మీ దేవి గారు రచించిన ‘సత్యాన్వేషి చలం’ అనే పుస్తకం దొరుకుతున్నది. అది చదవండి.(ఈ పుస్తక పరిచయం నా బ్లాగులో ఉంది)

  స్పందించండి
 • 11. కె.మహేష్ కుమార్  |  2:24 సా. వద్ద సెప్టెంబర్ 12, 2008

  @అబ్రకదబ్ర: చలాన్ని అర్థం చేసుకోలేక అనుభవించడానికి ప్రయత్నించినవాడిగా ఒక మాట. చలానిది “అభిప్రాయ సాహిత్యం” కాదు “అనుభవసాహిత్యం”. సమాజానికి తనేదో నేర్పాలనో, ఉద్దరించాలనో, తను చేసేది సరైనదే అని నమ్మాడుకాబట్టి అందరు అలా చెయ్యాలనో లేక అలా చెయ్యలేనివారు చేతకానివారనో ఎప్పుడూ ఇధ్బోధించడానికి ప్రయత్నించలేదు.

  ’మైదానం’ కూడా తన అన్ని కథలూ నవలల్లాగానే రాసుంటాడు. హిట్టా..ఫట్టా అనే విషయాన్ని తను జీవితంలో ఎప్పుడూ పట్టించుకున్న ధాఖలాలు లేవు. కాబట్టి ఈ నవల అందుకు మినహాయింపుకాదు. తను అనుకున్నది అనుభవించింది రాశాడు. దానికి విలువల్ని ఆపాదించి నెత్తినకట్టుకున్నా, అన్యాయమని నేలకేసికొట్టినా తనకొచ్చిన తేడా పెద్దగా ఏమీ లేదు.

  ఇక మైదానం నచ్చకపోవడం మీ వ్యక్తిగత అభిరుచి కాబట్టి అందులో ఎటువంటి ఆక్షేపణలూ చెయ్యజాలను. నా జీవితంలో కొంత వేదాంతాన్ని, అలౌకిక ఉనికిని సృష్టించిన పుస్తకాలలో బుచ్చిబాబు ‘చివరకుమిగిలేది’ తరువాత దీనికే స్థానం.

  స్పందించండి
 • 12. కొత్తపాళీ  |  8:20 సా. వద్ద సెప్టెంబర్ 12, 2008

  నాయనలారా .. సుమారు నూరు పుస్తకాలు రాసిన చలాన్ని,ఒక సమాజపు ఆలోచనా ధోరణి మీద శతాబ్దానికి పైగా బలమైన ముద్ర వేసిన చలాన్ని, ఒక్క కథో నవలికో చదివి “చలం ఇట్టాంటివాడు” అని అంచనా వెయ్య ప్రయత్నిస్తున్నారే! ఎంత వెర్రితనమో అర్ధమవుతోందా?

  స్పందించండి
 • 13. KRISHNA RAO JALLIPALLI  |  9:00 సా. వద్ద సెప్టెంబర్ 12, 2008

  చలాన్ని .. అర్థం చేసుకొన్నవారికి – అర్థం చేసుకోన్నంత. అభిరుచులు పలు రకాలు. మనిషి మనిషి కి మారుతుంటాయి మరి. కాలానికి కాలానికి కూడా మారుతూ ఉంటాయి. ఆ మాట కొస్తే.. ఇప్పుడు SP బాలు గారి పాటలు అంటే నాకు ఇష్టం ఉండవు.. అలాగే యండమూరి రచనలు అన్నా.

  స్పందించండి
 • 14. bollojubaba  |  9:47 సా. వద్ద సెప్టెంబర్ 12, 2008

  కొత్తపాళీ గారు
  సువర్ణాక్షరాల వంటి మాటలు చెప్పారు. నిజమే.
  చలం పై దుమారం లేచినప్పుడల్లా చలానికే మేలు జరుగుతా ఉంటాది. (అతన్ని గురించి మరింత మంది ఆలోచిస్తారు, మరింతమంది చదువుతారు, మరింతమంది రెండు వర్గాలుగా విడిపోయి భావాలతో కొట్టుకుంటావుంటారు). బహుసా బతికుంటే చిరునవ్వు నవ్వుకుంటా ఉండే వాడేమో.
  చలం ఒక రేడియో ఇంటర్వూలో అంటాడు – నా సాహిత్యం అంతా నేను చేసిన అంత:బహిర్ యుద్దమే- అని.
  తెలుగు సాహిత్యంలో చలం పాత్ర విస్మరింపరానిది. అతని భావాలను మైనస్ చేసి (ఎందుకంటే భావాలు చాలా సందర్భాలలో కాలదోషం పడుతూ ఉంటాయి. ఏ షేక్స్పియర్వో తప్ప)
  అతని రచనలను చదివితే కలిగే మజా ఆ కాలం నాటి ఏ రచయితా (ఇంకా తెగించి చెప్పాలంటే ఆ తరువాత కాలంలో కూడా) ఇవ్వలేదనేది ఒక సత్యం (కనీసం నామట్టుకు).

  బొల్లోజు బాబా

  స్పందించండి
 • 15. శశాంక  |  3:24 సా. వద్ద సెప్టెంబర్ 12, 2008

  @నిషిగంధ గారు: ఈ కథలో నాకదే అనిపించింది
  @KRISHNA RAO గారు, durgeswara గారు: చలం ఇతర రచనలు చదివితే నా అభిప్రాయం మారుతుందేమో. చలం చివరిదశలో రమణ మహర్షిని కలిశారని తరువాత అయన రచనలలో కొంత మార్పు వచ్చిందని విన్నాను.
  @అబ్రకదబ్ర గారు: మీ ఆవేశం నాకర్ధమైంది
  @శ్రవణ్ గారు: మైదానం పుస్తకం గురించి నేనూ చాలా విన్నాను. బహుశా అప్పటి సామాజిక పరిస్థితులని దృష్టిలో ఉంచుకుని మనం ఈ పుస్తకాన్ని చదవాలేమో
  @Saraswathi Kumar గారు: చలం గురించి అన్వేషణ చేయాల్సిందేనండి

  స్పందించండి
 • 16. శశాంక  |  11:41 ఉద. వద్ద సెప్టెంబర్ 19, 2008

  @కొత్తపాళీ గారు, @బొల్లోజు బాబా గారు అంతేనంటారా… 🙂

  స్పందించండి
 • 17. Suneeth Kumar  |  9:05 సా. వద్ద అక్టోబర్ 11, 2008

  Anadariki Namaskaram!

  ‘Sahithya vimarsha’ anedi enthati vyakthigatha spandano, ‘Sahithyam’ kooda anthe ani naa abhiprayam. Kaani kondaru annatlu avi samajagatham ayinapudu daaniki kontha badhyatha kooda avasaramenemoo.

  Chadavatam modalu pettina kshaname ee rachanani a-to, e-to, eto oka vaipu JUDGE chesi pareyyali anna dorani lo pothe, ika migiledi Vyakthiigatha aropanale, anduloni vishayalani nijanga ACCEPT chesi, anubhavinchagalithe nijamaina ‘Sahithya vimarsha’ jaruguthundi.

  Chalam rachanalani nijanga chadavalante, manam manala kaakunda chalamlaagane chadavali. Ade mansutho chadavali, ade mantatho chadavaali. Athani anni rachanallo kanipinche modati amsham kevalam ‘visrukhalatha’, ade ayana kathalakannitiki aarambham, ade oopiri – kaani ade sarvaswam kaadu.

  Vistrukaathaku venaka vunna vastavala thaaluku jigupsa. Adi bhariche sthairyam vunnavadike athani rachanalu.
  Eee godavalantha endukane ayyane oo sari chanipoye mundu naa kathalu ika evaru chadavakandi annadata!

  Seriously… ika mee istam !!!

  స్పందించండి
 • 18. nirmal  |  6:19 సా. వద్ద జనవరి 7, 2011

  నేను కూడా ఆ కధ చదివాను, మీరు వ్రాసింది చాలా భాగుంది.

  స్పందించండి
 • 19. nirmal  |  6:09 సా. వద్ద జనవరి 21, 2011

  నాలో చలం (nirmal jaggumantri)
  చలం ఒక్క గొప్ప స్త్రీ వాది, చలం ఒక్క మార్పు , చలం ఒక్క విప్లవం . చలం ఒక్క ఆదర్శం , చలం ఒక్క సంఘ సంస్కర్త,
  చలం ఒక్క సందేశం .చలం ఒక్క సంచలం

  చలం మీద చాలా మందికి మంచి అభిప్రాయం లేదు, శృంగార కవి అని , అశ్లీల కవి అని అభిప్రాయం ఐతే, చలం రచనలు ఒక్కటి, రెండు చదివి ఒక్క అభీప్రాయని కి రావడం తప్పు. చలం రచనలలో శృంగారం లేని రచలలు స్త్రీ పాత్ర లేని రచనలు చాలా ఉన్నాయ్.
  కొంతమంది చలం కేవలం స్త్రీ వాది గా మాత్రమే అభివర్ణించారు. ఐతే చలం కేవలం స్త్రీ వాది మాత్రమే కాదు చలం ఒక్క సంఘసంస్కర్త , మానవతావాది కూడాను.
  చలం గొప్ప స్త్రీ వాది. పూర్తిగా స్త్రీ స్వేఛ్చ కోరుకున్న వ్యక్తి. చలం అభిప్రాయం లో స్త్రీ స్వేఛ్చ క్లుప్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే పురుషుడి కి స్వేఛ్చ ఎటువంటిదో స్త్రీ స్వేఛ్చ అటువంటిదే . జీవితానికి సంబంధించి ప్రతి రంగంలోనూ, ప్రతి ఒక్క అంశంలోనూ పురుషుడి కి ఏది స్వేచ్చో స్త్రీ కి అదే స్వేఛ్చ. చలం ఈ అభిప్రాయాని స్త్రీ కోసం, స్త్రీ యిష్టం , స్త్రీ విద్య అనే మాటలు వింతగా వున్నా రోజులలో ( స్త్రీ 1925 రాసిన పుస్తకం ) తెలియజేయటం ఒక్క విప్లవం.
  స్త్రీ స్వేచ్చని చలం ఎలా కోరుకునడంటే ఉదాహరణకి ఒక్క స్త్రీ చలం వద్దకి వచ్చి నాకు సిగరెట్ తాగాలనీవుంది కానీ ఆరోగ్యం చెడిపోతుంది అని కాల్చటంలేదు అని చెప్పినపుడు చలం సమర్దిస్తాడు లేదా తన తల్లి, తండ్రుల భాదపడతారు అని చెప్పిన చలం సమర్దిస్తాడు. కాని నేను స్త్రీ ని కాబట్టి కాల్చటం లేదు అని చెప్పినపుడి చలం సమర్దించాడు. పురుషుడికి ఏది స్వేచ్చో స్త్రీ కి అదే స్వేఛ్చ అని చలం అబిప్రాయం

  స్త్రీ వంట గది కి పరిమితమైన కాలంలో స్త్రీ కి కూడా శరీరం వుంది. దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమె కి మెదడువుంది , దానికి జ్ఞానం ఇవ్వాలి. ఆమె కి హృదయం వుంది, దాని కి అనుభవం ఇవ్వాలి అని కోరుకొన్న గొప్ప స్త్రీ వాది చలం.

  చలం ఒక్క గొప్ప సంఘ సంస్కర్త. కులం అధిపత్యం వున్నా కాలంలో బ్రహ్మాన కులంలో పుట్టిన చలం కుల ఆచారాలు వ్యతిరేకించాడు. కేవలం చెప్పడమేగాక, చెప్పింది చేయటమనే చిత్తశుద్ది చలం ప్రత్యేకత. కులంలో వేలిపడ్డాడు అనంతపురం, నెల్లూరు , ఏలూరు , బందర్ , బెజవాడ , భీమిలి , కరీంనగర్ ఇలా ఆంధ్రప్రదేశ్ లో పలుచోట్ల ట్రెయినింగ్ స్కూల్ టీచరుగా పనిచేశారు. ప్రతిచోట ఊరి బైట ఏ పాడుబడ్డ ఇంట్లోనో, క్రిస్టియన్ లేక ముస్లిం పేటలలోనో కాపురం ఉండేవాడు.
  చలం మానవతావాది అనే విషయంలో సందేహం లేదు. లేక పోతే, అనాధపిల్లన్ని, కని ఆఖర్లేదని పారేసే పిల్లాన్ని , వితంతువుల్ని, అభాగ్యులున్ని, బాలవితంతువుల్ని, చేరదీసి తనకే, రోజుల్ని, వెల్లదీయటం కష్టంగా వున్నా రోజుల్లో కూడా ఇంట్లో ఆశ్రయమిచేవాడు.

  చలం సాహిత్యం వివాదాస్పద గూర్చి రంగనాయకమ్మ గారు ఇలా అన్నారు .

  ఒక్క పుస్తకాని పదిమంది చదివినప్పుడు అందులోవున్న విషయం ఏమిటో పదిమందికి ఒకే రకంగా కనబడితే ( అందరికి మంచిగా లేక అందరికి చెడ్డగా కనబడితే )దాని వల్ల వివాదం వుండదు.

  చలం స్త్రీ ఒక్క ముఖ్యమైన సందేశం ఇచ్చడు. స్త్రీ ఒక్క మాటవల్ల , చూపువల్ల పురుషుడికి సందిచ్చిందా …. ఇక అతని అధికారానికి , కోరికలకి, విన్న పాలకి అంతం వుండదు, అసలు పర్యవసానం అక్కర్లేని స్త్రీ మొదటినించి విముఖంగానే వుండాలి… నిప్పువలె వుండాలి అని తెలియజేసాడు.

  చలం స్త్రీ నీ లేచిపోమ్మనాడు అని కొందరి అభిప్రాయం ఐతే అతను రాసిన రచలలో మైదానం ఒక్క సంచలం. ఈ నవల రాత్రి తలుపులు వెసుకొని చదువుకొనే నవలగా అభివర్ణించారు. అందులో శృంగరం మాత్రమే చాలామందికి అర్ధమైంది . కాని అందులో లేచిపోయీన స్త్రీ దుస్తితి గూర్చి చాలామందికి కనిపించలేదు. శృంగారం వున్న పేజీలు తిపుకొని చదువుకోనేవారికి ఇది కనిపించదు.

  మైదానంలో కధనాయక ( లేచిపోయిన స్త్రీ పాత్ర ) మనసులోని మాటలు యింకొకరి భార్య అని యోచించకుండా నన్ను కోరిన అమీర్ ( కధానాయకుడు ) నన్ను వదలి యికోకర్ని మొహించాలంలో ఆశర్యమేముంది ? మామయ్యా అన్న మాటలే నిజమేమో : ఇలా శరీర ఆకర్షణకి లోబడి జీవితాన్ని వప్పగించుకున్న దర్భాగ్యాల గతి యింతే గావును . వేర్రిదననైనానా ? మామయ్యే చివరికి వివేకవంతుడా ?

  ఈ ఒక్క కొమ్మనీ నమ్ముకుని అని ఆశ్రయాలనీ తన్నేశాను. ఇది యిట్లా పెళ్ళుమని విరిగింది.
  ఐతే లేచిపోయిన స్త్రీ నీ గొప్పగా వర్ణించలేదు ( ఒక్క సంధర్బంలో కవి నాయకి చేత యిలా) ఆ ఊళ్ళో కి వెళ్ళడం, మళ్ళా ప్రజల్ని చూడడం అదే మొదటి సారి. కాళ్ళు ఒన్నికాయి . అందరూ నన్ను చూసి నవ్వుతున్నటే వుంది నా మనసుకి ”

  లేచిపోయిన స్త్రీ ( ఒక్క భర్తను వదలి ) చంచలత్వం తెలుపుతు కవి ఒక్క సందర్భంలో ఇలా ” అమీర్ , అమీర్ నమ్ము నీమీద నా ప్రేమ ఏమాత్రమూ తగ్గలేదు మీరా విచారం చూడలేక అతన్ని నిరాకరించలేదు.
  చివరికి నవలలో ఆత్మ హత్యలు , హత్యలు , పోలీసులు ఇలా ముగించి లేచిపోయిన స్త్రీ స్థితి గూరించి తెలియజేసాడు.

  చలం స్త్రీ నీ లేచిపోమ్మని అనలేదు. “” నాశనమే సంసారముకన్న నయమని స్థిరంగా తెలిస్తేగాని ఆ పని చెయ్యవద్దనీ పదేపదే తెలియజేసాడు.
  పెళ్లి కాని కాక పోనీ ఒక స్త్రీ కి ఒకే పురుషుడు. ఒక పురుషుడి కి ఒకే స్త్రీ అనే ఆదర్శం చాలా వున్నతమయింది అని చలం గారే అనేక సందర్బలలో చేప్పారు. ( నేటి న్యాయస్థానాలు కూడా సమర్దిచుచున్నాయి. ఈ విషయం చలం ఎపుడో గుర్తించారు.

  ఇవి ఏవి గుర్తించని వ్యక్తులు మాత్రమే చలం స్త్రీ నీ లేచిపోమ్మనాడు, చేడిపోమ్మనాడు అని విమర్శించడం జరుగుతుంది.

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


ఇటీవలి టపాలు


%d bloggers like this: