Archive for అక్టోబర్, 2008
వర్డుప్రెస్సు నుండి బ్లాగరుకి పయనం
ముందుగా ఓ మాట… నా బ్లాగు వర్డుప్రెస్సు నుండి ఇక్కడికి ( http://sashanka.blogspot.com ) మారింది.
నేను వర్డుప్రెస్సు నుండి బ్లాగరుకి ఎందుకు మారుతున్నానంటే:
1. బ్లాగరు గూగులోడి సర్వీసు.
2. మిగతా గూగుల్ సర్వీసులనుండి బ్లాగరుకి మంచి సదుపాయాలు ఉన్నాయి.
3. వర్డుప్రెస్సు లో టెంప్లేట్ ని మనకి నచ్చిన విధంగా మార్చాలంటే డబ్బులు చెల్లించాలి. బ్లాగరు పూర్తిగా ఉచితం.
4. బ్లాగరు లో ఐతే బోలెడు ప్రయోగాలు చేయవచ్చు.
5. ఈమధ్య వర్డుప్రెస్సోళ్ళు బ్లాగుల్లో యాడ్ లు కూడా పెడతామంటున్నారు.
కానీ ఏమాటకి ఆ మాటే చెప్పుకోవాలి. బుద్ధిగా ఏ ప్రయోగాలు చేయకుండా బ్లాగు రాసుకొనేవాళ్ళకు వర్డుప్రెస్సే ఉత్తమం
ఇక నా వర్డుప్రెస్స్ బ్లాగులోని టపాలను బ్లాగరులోకి మార్చడానికి (Comments ని కూడా Export చేయడానికి) చాలా పరిశోధనలు చేయవలసివచ్చింది. గూగులోడిని తగలెయ్య, ‘వర్డుప్రెస్సు నుండి బ్లాగరుకు’ మారడం ఎలా అని సెర్చ్ చేస్తే సెర్చ్ రిసల్ట్ లో అన్ని లింకులు ‘బ్లాగరు నుండి వర్డుప్రెస్సుకి’ మారడం మీదే వచ్చాయి. అప్పుడు అర్ధమైంది నాకు ఎక్కువమంది బ్లాగరు నుండి వర్డుప్రెస్సుకి మారతారని. చివరకి కొన్ని లింకులు దొరికాయి (blogsyn0.3, blog2blog, blogSyncV1.1, wxr2blogger). ఏ Installation అవసరం లేకుండా online లో టపాలు Export చేయాలంటే blogSyncV1.1 ని ఉపయోగించవచ్చు. blogsyn0.3 లో Comments కూడా Export చెయ్యొచ్చన్నాడు కానీ Comments Export కాలేదు. బహుశా Google Blogger Data API మారడం వల్లనేమో.
ఇంతాచేసి చివరికి Comments ని మాత్రం Export చేయలేకపోయాను
.


