వైరస్ లను నిరోధించే సులువైన మార్గం

సెప్టెంబరు 12, 2008 at 11:10 పూర్వాహ్నం 7 వ్యాఖ్యలు

ఈమధ్య ఎక్కువ శాతం వైరస్ లు పెన్ డ్రైవ్ ల ద్వారానే వస్తున్నాయి. సిస్టం లో ఆటోరన్ ని నిలిపివేయుటద్వారా ఇలా వచ్చేవాటిని నిరోధించవచ్చు. దీనికోసం ‘Group policy’ లో ఈ క్రింద చూపినట్టు కొన్ని మార్పులు చేయాలి.

Go to Start > RUN command > in RUN command give   gpedit.msc  >  press OK

ఇప్పుడు ‘Group policy’ విండో ఓపెన్ అవుతుంది. ఈ క్రింద చూపినట్టు ‘User Configuration’ ని మార్చాలి.

ఇలా CD ల నుండి ఆటోరన్ ద్వారా వ్యాపించే వైరస్ లను కూడా ఆపవచ్చు. కానీ ఇలా ఆటోరన్ ని నిలిపివేయడం వలన CD లు ఆటోమాటిక్ గా ఓపెన్ కావు.  ఏదైనా మృదులాంతరాన్ని (software) ఆటోమాటిక్ గా స్థాపించాలంటే (install చేయాలంటే) CD  డ్రైవ్ మీద ‘Right click’ చేసి  ‘Auto play’ ని క్లిక్ చేస్తే సరిపోతుంది.

చాలామంది కాపీ చేసే తొందరలో ఫోల్డర్ పేరుని మార్చరు. “New folder” పేరుతోనే ఫోల్డర్ ఉండిపోతుంది. దీనిని ఆసరాగా తీసుకుని ఈమధ్య “New folder.exe” అనే వైరస్ బాగా వ్యాపిస్తున్నది. వైరస్ “New folder” పేరుతో కాపీ అవుతుంది. మనకు తెలియక మనం కాపీ చేసిన ఫోల్డరే కదా అని క్లిక్ చేస్తాం. అంతే సంగతులు !!. సాధ్యమైనంతవరకు ఫోల్డర్స్ కి అర్ధవంతమైన పేర్లు ఇవ్వడం మంచిది. దీనివల్ల మనకు తెలియని పేరుతో ఏదైనా వైరస్ కాపీ ఐనా ఇట్టే తెలిసిపోతుంది. ఒకవేళ వైరస్ ‘Hidden’ గా ఉంటే ఎలాగూ ఆటోరన్ నిలిపివేయబడింది కాబట్టి దానితో మనకి ప్రమాదం లేదు.

Entry filed under: సాంకేతికాలు. Tags: .

నాకు తెలిసిన చలం ఆంధ్రావాళ్ళకు అక్కర్లేదా ఆత్మగౌరవం

అభిప్రాయములు Add your own

  • 1. srikanth  |  2:14 అపరాహ్నం వద్ద సెప్టెంబరు 12, 2008

    thanks

    జవాబు
  • 2. chaitanya  |  7:13 అపరాహ్నం వద్ద సెప్టెంబరు 12, 2008

    nice information. wil plz tell me how to remv autorun.inf (vb script) virus in pendrive

    జవాబు
  • 3. కట్టా విజయ్  |  12:31 పూర్వాహ్నం వద్ద సెప్టెంబరు 17, 2008

    మంచి టిప్ అందించారు,చాలా ధ్యాంక్స్,
    అలాగే డిస్క్ చెక్ రాకుండా చేయటానికి ఎమైనా ఉంటే చెప్పగలరు!

    జవాబు
  • 4. e.bhaskaranaidu  |  8:06 అపరాహ్నం వద్ద సెప్టెంబరు 17, 2008

    the tips given are very much useful thanks.

    జవాబు
  • 5. e.bhaskaranaidu  |  8:07 అపరాహ్నం వద్ద సెప్టెంబరు 17, 2008

    The tips given are very much useful. Thanks.

    జవాబు
  • 6. శశాంక  |  4:02 అపరాహ్నం వద్ద సెప్టెంబరు 20, 2008

    @ కట్టా విజయ్ గారు: ముందుగా మీరు ఒకసారి డిస్క్ చెక్ చేయనివ్వండి. తరువాత కూడా మళ్ళీ డిస్క్ చెక్ అడిగితే ఈ క్రింది URL కి వెళ్ళండి.
    http://www.kellys-korner-xp.com/xp_tweaks.htm

    ’82. Disable or Enable Check Disk Upon Boot’ కి వెళ్ళి Disable link పై right click చేసి save as ని select చేసుకొని .reg extension తో file ని save చేయండి (.txt extension ఉంటే దానిని తీసివేయండి).

    లేదా ఈ File ని ఇక్కడ నుండి Copy చేసుకోండి,
    http://sashanka.wordpress.com/files/2008/09/disablecheckdisk.doc
    .doc extension తీసి .reg extension తో Save చేయండి. (Extension కనిపించడం కోసం My Computer > Tools Menu > Folder Options > ‘View’ Tab > ‘Hide extension for known file types’ ని Check/Tick చేసి OK press చేయండి.)

    [Registry ని మార్చే ముందు System Resore లో ఒక check point ని పెట్టుకోవడం మేలు. దీనికోసం,
    Go to Start > All Programs > Accessories > System Tools > System Restore

    ఇప్పుడు 'System Restore Window' లో 'Create a restore point' ని select చేసుకొని 'Next' button ని press చేయండి.
    ఇప్పుడు 'restore point description' లో ఏదో ఒక అర్ధవంతమైన పేరు ఇచ్చి 'Create' Button ని press చేయండి.
    ఇలా చేయడం వలన పొరబాటున Registry Corrupt అయితే మళ్ళీ ఇంతకుముందు Save చేసిన Point కి వెళ్ళవచ్చు.
    ఏదైనా పొరబాటు జరిగితే 'System Restore' ని చేయడానికి (Save చేసిన time point కి వెళ్ళడానికి) అదే 'System Restore Window' లో 'Restore my computer to an earlier time' ని select చేసుకొని 'Next' button ని press చేయండి. మీకు problem రాని తేదీని ఎంచుకుని 'Next' button ని press చేయండి. తరువాత వచ్చే Window లో కూడా 'Next' button ని press చేయండి. System ఆ safe point కి వెళ్ళిపోతుంది.]

    ఇప్పుడు ఆ Save చేసిన File ని Double click చేయండి. Conformation అడిగితే Yes అని click చేయండి. ఈ Registry ని మార్చడం వలన ఏదైనా సమస్య వస్తే ఇంతకుముందు చెప్పినట్టు ‘System Restore’ ని చేయండి.

    నిజానికి సమస్య వచ్చిన Drive పై Dirty Bit అనే ఒక Flag set చేయబడుతుంది. ఒకసారి Disk check అయితే ఇది clear అవ్వాలి. కానీ ఎదైనా కారణాలవల్ల (File corruption లేక Disk damage వల్ల) ఇది clear అవ్వకపోతే మళ్ళీ మళ్ళీ Disk check జరుగుతుంది. కానీ ఈ Bit ని clear చేసే మార్గం లేదు, (Disk check ని ఆపడం తప్ప :) ).

    సమస్య ఉన్న Drive ని format చేయడం ద్వారా కూడా ఈ సమస్య తీరవచ్చు.

    జవాబు
  • 7. శశాంక  |  3:33 అపరాహ్నం వద్ద సెప్టెంబరు 21, 2008

    @chaitanya గారు:

    ముందుగా ఈ టపాలో చెప్పినట్టు ‘Auto play’ ని Disable చేయండి.
    Pen Drive ని Insert చేసి ఈ క్రింది విధంగా చేయండి:

    1. Open Command prompt (Start > Run > type cmd and press enter)

    2. మీ Pen Drive పేరు G అయితే G: అని టైప్ చేసి Enter నొక్కండి.

    3. ‘attrib -r -h -s autorun.inf’ అని టైప్ చేసి Enter నొక్కండి (quotes లేకుండా).

    ఒక వేళ ‘autorun.inf’ మీ Pen Drive లో లేకపోతే ‘File not found – autorun.inf’ అని వస్తుంది. ‘autorun.inf’ ఉన్నట్లైతే ఈ Command ఆ File కి ఉన్న Read (-r), Hidden (-h), System file (-s) Attributes ని తీసివేస్తుంది.

    4. ఇప్పుడు del autorun.inf అని టైప్ చేసి Enter నొక్కండి, ‘autorun.inf’ File delete చేయబడుతుంది.

    ఇలా G: స్థానంలో ఏ Drive పేరైనా పెట్టి ఆ Drive లోని ‘autorun.inf’ File ని తొలగించవచ్చు (Example D:).

    రెండో పద్దతి:
    ‘Autorun-Eater’ అనే మృదులాంతరాన్ని(Software) ని ఈ క్రింది లంకె నుండి దిగుమతి చేసి Install చేయండి.

    http://www.download.com/Autorun-Eater/3000-2239_4-10752777.html

    ఈ మృదులాంతరం ‘System tray’ (Bottom Right) లో open అవుతుంది. ఈ మృదులాంతరం System లో అన్నిDrive లలో ఉన్న ‘autorun.inf’ Files ని తొలగిస్తుంది ‘automatic’ గా.

    ఈ మృదులాంతరం ద్వారా ఏదైనా Virus వల్ల ‘Task manager’, ‘Folder options’, ‘Regedit’ లు పనిచేయకపోతే వాటిని సరిచేయవచ్చు. దీనికోసం ఈ మృదులాంతరం ‘System tray icon’ పై Right click చేసి ‘Registry Fix’ అనే option ని చూడండి.

    చాలాసార్లు Virus ల వల్ల మిగతా Drive లలో కూడా ‘autorun.inf’ File ఉంటుంది. దీనివల్ల ఏదైనా Drive ని Double click చేసినప్పుడు Separate window లో Open అవ్వడం, లేక ఏదైనా Error రావడం జరుగుతుంది. ఇలా ‘autorun.inf’ ల వల్ల వచ్చేvirus లను ‘Kaspersky Anti Virus’ ద్వారా సమర్ధవంతంగా తొలగించవచ్చు (కానీ ఇది ఉచితం కాదు :( ). మీ System లో ఏదైనా Virus వచ్చినట్టు అనుమానంగా వుంటే, ‘Kaspersky Anti Virus Online Scan’ ద్వారా Virus ని కనిపెట్టవచ్చు.

    (లంకె: http://www.kaspersky.com/virusscanner)

    అయితే ఈ పద్దతిలో Virus ఉన్నట్టుమాత్రమే తెలుస్తుంది. కానీ Virus ఏమిటో తెలిస్తే దానిని తొలగించడానికి Net లో చాలా Patch లు ఉంటాయి. ‘Kaspersky Anti Virus’ కి అన్ని ‘Anti Virus Software’ లకంటే మంచి ‘Detection Rate’ ఉంది.

    జవాబు

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


ఇటీవలి జాబులు


Follow

Get every new post delivered to your Inbox.