నా దేశం ఎందుకిలా ఉంది…

సెప్టెంబరు 10, 2008 at 2:56 అపరాహ్నం 7 వ్యాఖ్యలు

ఇది రామాయణ కాలం నాటి సంగతి. వనవాసానికి బయలుదేరిన రాముడి వెంట పురజనం కూడా చాలాదూరం వస్తారు. ఊరి చివరకు వెళ్ళిన తరువాత రాముడు వెనక్కి తిరిగి, “అమ్మలారా అయ్యలారా” నాకోసం మీరు చాలాదూరం వచ్చారు, ఇక తిరిగి మీఇళ్ళకు వెళ్ళండి అని అంటాడు.

అలా చెప్పగా చాలామంది వెనక్కి వెళ్ళిపొగా కొంతమంది మాత్రం అక్కడే నిలబడి ఉంటారు (వీళ్ళు హిజ్రాలు) . రాముడు మీరు వెళ్ళలేదేమిటి అని అడుగుతాడు. దానికి వాళ్ళు ఇలా సమాధానమిస్తారు, మీరు ఇందాక “అయ్యలారా అమ్మలారా” అని అన్నారు, మరి మా సంగతి ఏమిటి అని అంటారు. వాళ్ళ భక్తికి మెచ్చిన రాముడు వాళ్ళకి ఓ వరమిస్తాడు. 1947 తరువాత మీరు భారతదేశాన్ని ఏలతారు అని…..!!!

(ప్రముఖ నవలా రచయిత కుష్వంత్ సింగ్ గారి ఢిల్లీ అనే పుస్తకంలోనిది)

Entry filed under: కలగూరగంప. Tags: .

ఏదీ శాశ్వతం కాదు నాకు తెలిసిన చలం

అభిప్రాయములు Add your own

  • 1. రాకేశ్వర రావు  |  5:56 అపరాహ్నం వద్ద ఫిబ్రవరి 20, 2008

    హోలీ *&^@ !

    జవాబు
  • 2. ప్రవీణ్ గార్లపాటి  |  7:50 అపరాహ్నం వద్ద ఫిబ్రవరి 20, 2008

    ఆహా. ఏం కథ అల్లారండీ… :)
    మీరు రాసిందేనా ??

    జవాబు
  • 3. radhika  |  12:45 పూర్వాహ్నం వద్ద ఫిబ్రవరి 21, 2008

    :)

    జవాబు
  • 4. వికటకవి  |  4:49 అపరాహ్నం వద్ద ఫిబ్రవరి 21, 2008

    1947 తర్వాత అన్నారు బానే ఉంది, ఏమైనా కటాఫ్ డేట్ ఉందా ఆ హిజ్రాల పాలనకి. లేకపోతే అవకాశమొచ్చినా మేము గద్దెనెక్కలేకపోతాము :-)

    జవాబు
  • 5. చిన్నమయ్య  |  8:43 పూర్వాహ్నం వద్ద సెప్టెంబరు 11, 2008

    ఇది చాలా హేయమైన ఆత్మ నింద. అంటే స్వాతంత్రానికి పూర్వం ఏలుబడి మెరుగ్గా వుండేదనేగా, మీరు మీ టపాలో, చెప్పక చెబుతున్నారు. వాళ్లు దోచుకుపోదగ్గదంతా, దోచేసి, కొత్త సంస్కృతిని నెత్తిన రుద్ది, లోపల చిచ్చు పెట్టి, వాళ్ల దారిన వాళ్లు చక్కాపోయేరు. మీరెంచుకున్న 1947 మైలు రాయి తరువాత ప్రజలే ప్రభువులు. ఈ మాట మీరు కాదనడానికి వీలు లేదు. ఈ మధ్య తాడేపల్లి గారి బ్లాగులో ఒక కొత్త చేర్పు గమనించేను. వారి మాటల్లోనే – “ప్రజాస్వామ్యంలో ప్రతి మనిషీ ప్రతి విషయం గుఱించి ఆలోచించవలసిందేనని, ఆ బాధ్యత నుంచి తప్పించుకొనే మార్గమే లేదనీ నేను భావిస్తాను”.

    మీరు ఎవరిని ఎత్తిచూపుతున్నారు?

    జవాబు
  • 6. కె.మహేష్ కుమార్  |  9:31 అపరాహ్నం వద్ద సెప్టెంబరు 11, 2008

    @చిన్నమయ్య: ఇవి బ్లాగరి అభిప్రాయాలు కావు. కుష్వంత్ సింగ్ అనే ప్రముఖ రచయిత మాటలు. అదీ out of his much read book “Delhi”. ఇది ఒక చారిత్రక, రాజకీయ వ్యంగ్యం. కుష్వంత్ సింగ్ is known for his wit and utter shamelessness of expression. దీనికి ఇంత బాధపడాల్సిన అవసరం లేదు.

    నిజానికి ప్రజాస్వామ్యమంటే ఇలా రాయగలగటమే!

    జవాబు
  • 7. శశాంక  |  10:08 అపరాహ్నం వద్ద సెప్టెంబరు 11, 2008

    @ మహేష్ కుమార్ గారు: ధన్యవాదాలు
    @ చిన్నమయ్య గారు: కుష్వంత్ సింగ్ గారు మారుతున్న రాజకీయ పరిస్థితులపైన వ్యంగ్యంగా ఇలా అన్నారు. స్వాతంత్ర్యం రాక పూర్వం ఉన్నదానికి దీనికి ఏ విధమైన సంబంధం లేదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా రాజాజీ, వల్లభాయ్ పటేల్, నెహ్రూ వంటి ఎందరో మహానుభావులు ఈ దేశాన్ని సరైనదారిలో నడిపించారు. కానీ ఈమధ్య మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కుష్వంత్ సింగ్ గారు చెప్పిన దాంట్లో కొంత నిజం వుందనిపించింది.

    జవాబు

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


ఇటీవలి జాబులు


Follow

Get every new post delivered to your Inbox.