ఏదీ శాశ్వతం కాదు
సెప్టెంబరు 10, 2008 at 2:29 అపరాహ్నం మీ ఉద్దేశ్యం…
అనగనగా ఓ రాజ్యం,ఆ రాజ్యానికి ఓ రాజు. ఓ రోజు ఆ రాజుగారిదగ్గిరికి ఓ మునీశ్వరుడు వస్తాడు. ఆ ముని రాజుగారికి ఓ తాయిత్తు ఇచ్చి, అందులో ఓ మంత్రం ఉందని కష్ట కాలంలో దానిని చూడమని చెబుతాడు. కొంతకాలానికి ఆ రాజు వేటకు వెళతాడు. ఆ విషయం తెలుసుకున్న శత్రుదేశపు సైన్యం అడవిలో ఉన్న రాజు మీద దాడి చేస్తారు. రాజుగారు తెలివిగా గుబురుగా ఉన్న ఓ చెట్టెక్కి దాక్కుంటాడు. రాజుగారికి మునీశ్వరుడు ఇచ్చిన తాయిత్తు గుర్తుకువస్తుంది. దానిని విప్పి చూడగా అందులో ఇలా వ్రాసి ఉంటుంది, “ఏదీ శాశ్వతం కాదు, ఇది కూడా జరిగిపోతుంది”. రాజుగారికి విషయం అర్దమౌతుంది, ధైర్యంగా అలాగే ఉంటాడు.
ఈలోగా వేటకు వచ్చిన సైనికుల్లో ఒకడు ఎలాగొలా తప్పించుకుని రాజ్యానికి చేరుకుంటాడు. విషయం తెలుసుకున్న సైనికులు అడవికి వెళ్ళి శత్రుసైనికులను చీల్చి చెండాడుతారు. ఆవిధంగా రాజుగారు కష్టాలనుండి గట్టెక్కుతాడు.
ఈ పై రెండు మాటల్లోనే నాకు ఎంతో వేదాంతం వుందనిపించింది
Entry filed under: కలగూరగంప. Tags: .



Trackback this post | Subscribe to the comments via RSS Feed